హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కాంట్రాక్టర్లు ముట్టడించారు. గత ఆగస్టు నుంచి రూ. 1,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వారు తెలిపారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు వారు ప్రయత్నించారు. దీంతో బల్దియా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. బిల్లులు చెల్లించేంత వరకు పనులు చేయబోమని ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు హెచ్చరించారు.