contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైతులకు న్యాయం చేయాలని జాతీయ రహదారిపై ధర్నా : సునీత లక్ష్మారెడ్డి

మాసాయిపేట/తూప్రాన్ : విద్యుత్ సమస్యల కారణంగా ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించేందుకు మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి శనివారం చేరుకున్నారు. మాసాయిపేట గ్రామ శివారులో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించి, రైతుల ఆవేదనను స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బాధిత రైతులు యార్వ బాబా, గుర్రాల శ్రీనివాస్, గుర్రాల సత్తయ్య, జంగాల శంకర్, గౌరగళ్ల పెద్ద రాములు తదితరులతో ఎమ్మెల్యే మాట్లాడి, పంటలు ఎండిపోవడానికి దారితీసిన పరిస్థితులు, విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాసాయిపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడ నిర్వహిస్తున్న బ్లాక్ బుక్ రికార్డులను పరిశీలించారు.

విద్యుత్ సరఫరాలో లోపాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ మాసాయిపేట సమీపంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం అత్యవసరంగా గుర్తించి, నిరంతర విద్యుత్ సరఫరా కల్పించడంతో పాటు పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిన్న చౌదరి మధుసూదన్, చిట్టిమీల నాగరాజు, దుంపల శ్రీనివాస్, పవన్, రాము, శంకర్ యాదవ్, జింక సత్తయ్య, మాజీ సర్పంచ్ పోతనపల్లి సిద్ది రెడ్డితో పాటు బొమ్మరం, కొప్పులపల్లి, నాసాన్‌పల్లి, రామంతపూర్, హక్కింపేట, అచ్చంపేట, చెట్ల తిమ్మాయిపల్లి గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :