contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నక్సల్స్ దాడి … ముగ్గురు సీఆర్పీఎఫ్ జవానులు మృతి

మావోయిస్టులు అదను చూసి భద్రతాబలగాలను దెబ్బకొట్టారు. ఒడిశా నౌపడా ప్రాంతంలోని పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఓ క్యాంపు నుంచి మరో క్యాంపునకు వెళుతున్న సీఆర్పీఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. మరో ఏడుగురు జవాన్లకు గాయాలయ్యాయి. మరణించినవారిని ఏఎస్ఐ శిశుపాల్ సింగ్, సిబ్లాల్, ధర్మేంద్ర కుమార్ సింగ్ గా గుర్తించారు.

ఈ కాల్పుల ఘటనతో పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. ప్రస్తుతం అక్కడ మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒడిశాలో స్తబ్దుగా ఉన్న నక్సల్స్ ఉనికి చాటుకోవడం కోసమే ఈ దాడి చేసినట్టు భావిస్తున్నారు. ఈ దాడిలో మావోలు భారీ ఆయుధ సంపత్తిని వినియోగించినట్టు కాల్పులు జరిగిన స్థలంలో లభ్యమైన ఆధారాలు చెబుతున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :