ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘గౌరవనీయులైన శ్రీ వెంకయ్యనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. కొన్ని దశాబ్దాలుగా ఆయన మన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. మన దేశ ప్రజలకు ఆయన ఒక స్ఫూర్తి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం పట్ల ఆయనకున్న అభిరుచి చాలా గొప్పది. ఎన్నో ఏళ్లుగా ఆయనకు దగ్గరగా పని చేసే అవకాశం నాకు దక్కింది. ఆయనలో ఉన్న ఎనర్జీని చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఉప రాష్ట్రపతిగా (రాజ్యసభ ఛైర్మన్) పార్లమెంటు ప్రొసీడింగ్స్, చర్చల స్థాయులను ఆయన పెంచారు. ఆయన నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.
భారత ‘తెలుగు పలుకుకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపం వెంకయ్యనాయుడు గారు. ఆత్మీయులు వెంకయ్యనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏ పదవిలో ఉన్నా ప్రజాసేవను, ప్రజాస్వామ్య విలువలను మరువని మీరు… ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను సుఖసంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
గౌరవనీయులైన ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ – ఇండియా , జాతీయ అధ్యక్షులు వి. సుధాకర్ ట్వీట్ చేశారు.
@VPSecretariat
Dear Sir,
On this special day, i wish you all the very best, all the joy you can ever have and may you be blessed abundantly today, tomorrow and the days to come! May you have a fantastic birthday and many more to come… HAPPY BIRTHDAY!!!!— V.Sudhakar |Chairman | Print & Electronic Media (@Sudhakarpress) July 1, 2022