- విజిలెన్స్& ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు కృతజ్ఞతలు.
- ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్.
రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విజిలెన్స్& ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిన్న ఏకకాలంలో 54 వసతి గృహాలను తనిఖీ చేసి అందులో జరుగుతున్నా అవకతవకలను పై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పాటం హర్షణీయమని ఏపీ గిరిజన సంఘాల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ అన్నారు. శుక్రవారం సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు మెనూ ప్రకారం సక్రమంగా భోజనం అందించడమే కాకుండా తక్షణమే వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. స్టేషనరీ సామగ్రి లతోపాటు ఇతర వాటిలో అవినీతి జరిగిందని చెప్పుతూన్నా విజిలెన్స్ అధికారుల నివేదికలను ఆధారంగా చేసుకొని ఆయా వసతి గృహాల వార్డెన్ లను సస్పెండ్ చేయాలన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాల్లో నుంచి అద్దె భవనాల్లో కి విద్యార్థులను తరలించాలన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని శ్రీను నాయక్ పేర్కొన్నారు…!!