పల్నాడు జిల్లా పిడుగురాళ్ల స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ టీం , పిడుగురాళ్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ టీం ,కలిసి దాడులు నిర్వహించగా పిడుగురాళ్ల పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో ఒక గోడౌన్ లో ప్రభుత్వం వారిచే నిషేధించబడిన 26,360 సిగరెట్ ప్యాకెట్లు కనుగొనడం జరిగినది. సదరు సిగరెట్ ప్యాకెట్లు కలిగి ఉన్న ఒక వ్యక్తిని, సిగరెట్ ప్యాకెట్లను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. సదరు సిగరెట్ ప్యాకెట్లు కలిగి ఉన్న వ్యక్తి పేరు దాచేపల్లి రమేష్,తండ్రి సాంబశివరావు, నివాసము పిడుగురాళ్ల పట్టణం. సదరు ప్రాపర్టీ గల వ్యక్తిని తదుపరి చర్యల నిమిత్తం పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది. ఈ దాడుల యందు పల్నాడు స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో జెడి సిబ్బంది, పిడుగురాళ్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు