- పల్నాడు జిల్లా నరసరావుపేట నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు
- పల్నాడు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ‘శివశంకర్” కు ప్రశంసలు
ఆజాది కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు పదవ రోజున పల్నాడు జిల్లాలో ఎక్కడా లేని విధంగా వెయ్యి మీటర్ల జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఊరేగింపుగా స్థానిక ఎస్ ఎస్ ఎన్ కాలేజ్ నుండి స్టేడియం వరకు నిర్వహించుకోవడం అదృష్టమని జిల్లా కలెక్టర్ శ్రీ శివ శంకర్ లో తేటి పేర్కొన్నారు. బుధవారం ఉదయం త్రివర్ణ పతాక ఊరేగింపు స్టేడియం వరకు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆగస్టు ఒకటో తారీకు నుంచి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో ఇప్పటివరకు పలు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా నేడు త్రివర్ణ పతాక ఊరేగింపు చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోజు కార్యక్రమంలో జాతీయ పతాక ఆవిష్కర్త శ్రీ పింగళి వెంకయ్య గారి మనవడు శ్రీ నరసింహ ఈ కార్యక్రమంలో లో పాల్గొనడం గొప్ప విషయం అన్నారు.