ఆర్మూర్ లో స్మైల్స్ ది స్కూల్ లో చెట్ల పెంపకం కార్యక్రమం నిర్వహించారు. అంతరించిపోతున్న పర్యావరణాన్ని కాపాడటం మరియు మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడమే చెట్ల పెంపకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. చెట్లు ప్రకృతి ప్రసాదించిన విలువైన కానుకలు. చెట్లు మానవులకు మంచి స్నేహితులు అని, అంతేకాకుండా అవి మనకు రకరకాలుగా మేలు చేస్తాయని, ప్రపంచంలో చెట్లు లేకుండా మనుషులు మరియు ఇతర జంతువులు మరియు కీటకాల జీవితాలు అగమ్యగోచరంగా ఉంటాయాని డైరెక్టర్ రఫీగోహర్ అన్నారు. పాఠశాలలోని పిల్లలకు విద్యతో పాటు,చెట్ల పెంపకం మరియు వినోదభరితమైన కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలకు ‘ప్రకృతి తల్లి’ని ఎలా రక్షించాలో వారి బాధ్యతను గుర్తుచేసారు . ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు మరియు బోధనేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రిన్సిపాల్ షబానా గోహర్, డైరెక్టర్ రఫీగోహర్, స్టాఫ్ ప్రసన్న, సింధూర, సవిత, విమల, స్వప్న, లలిత, సరిత, ప్రజ్ఞ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.