ఓ కానిస్టేబుల్ తన చేతిలో భోజనం ప్లేట్ పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అధికారులు రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ నాసిరకం భోజనం పెడుతున్నారని, ఆకలితో ఉన్నా పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. బుధవారం మధ్యాహ్నం యూపీలోని ఫిరోజాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫిరోజాబాద్ పోలీస్ లైన్ ముందు ఉన్న హైవే డివైడర్‌పై కూర్చున్న ఆ కానిస్టేబుల్ ప్లేట్‌లో ఉన్న రొట్టెలను అక్కడ ఉన్న స్థానికులకు చూపిస్తూ.. జంతువులు కూడా ఈ రొట్టె తినలేవని… అలాంటి రొట్టెలు తమకు అందిస్తున్నారని ఆరోపించాడు. సరిపడా ఆహారం అందకపోతే డ్యూటీ ఎలా చేస్తామని ప్రశ్నించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి కానిస్టేబుల్ ఆవేదనను వీడియో తీశాడు.
ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ మనోజ్ కుమార్ ఆవేదన పట్ల స్పందించిన పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఔట్‌పోస్టు సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇతర కానిస్టేబుళ్లు అతడి వద్దకు చేరుకున్నారు. వారి ముందు కూడా ఆహార నాణ్యతపై కానిస్టేబుల్ మనోజ్ ప్రశ్నల వర్షం కురిపించారు. తాను ఇంటికి దూరంగా ఉంటున్నానని, ఆకలితో అలమటిస్తుంటే ఇలాంటి రోటీ ఎలా తింటానని కానిస్టేబుల్ నిలదీశాడు. ఈ అంశంపై పోలీస్ లైన్ ఇన్‌స్పెక్టర్ దేవేంద్ర సింగ్ సికార్వార్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ మనోజ్ కుమార్ తన భార్యతో గొడవ పడుతున్నాడని.. దీంతో అతడు కలత చెందుతున్నాడని చెప్పారు. బుధవారం మెస్‌లో భోజనం చేసేందుకు వెళ్లగా అక్కడ క్యూ ఉండటంతో అసహనం వ్యక్తం చేస్తూ మనోజ్ కుమార్ దుర్భాషలాడడం ప్రారంభించాడని వివరించారు. అయితే ఈ విషయం తమ పరిశీలనలో ఉందని రూరల్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తును ప్రారంభించామని, నిజానిజాలపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.
उत्तर प्रदेश के फिरोजाबाद की पुलिस मेस में मिल रहे खाने की क्वालिटी दिखा फूट-फूटकर रो पड़ा कॉन्स्टेबल
On camera, a @firozabadpolice
constable breaks down over ‘bad food quality’ at the local police lines. Police twitter handle says complaint being investigated but constable has a history of ‘indiscipline’@rashtrapatibhvn @PMOIndia @AmitShah @UPCMOffice @dgpup pic.twitter.com/U87u0l1TXs— V.Sudhakar |Chairman | Print & Electronic Media (@Sudhakarpress) August 11, 2022