బహుజనులకు విద్య అందుబాటులో లేని సమయంలో విద్య కోసం పోరాడిన మహనీయులు కారు చీకట్లో కాంతి కిరణం నారాయణగురు అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది.విజయలక్ష్మి కర్నూలు జిల్లా లోని స్థానిక బి క్యాంపు నందలి ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో సామాజిక సంఘసంష్కర్త నారాయణగురు 166వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా నంది.విజయలక్ష్మి సామాజిక సమానత్వం కోసం , అంటరానితనానికి వ్యతిరేకంగా నారాయణగురు పోరాటం చేశారని , దేవాలయాలనే పాఠశాలలగా మార్చి చదువు నేర్పించిన గొప్ప వ్యక్తి నారాయణగురు అని ఆమె అన్నారు. నారాయణగురు ఆలోచనా విధానాన్ని కొనసాగిస్తూ యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక పనిచేస్తుంది ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో MBC మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ,గుత్తి కి చెందిన మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ దేవమ్మ,జిల్లా ప్రధాన కార్యదర్శి సరస్వతి , కర్నూలు మండల గూడ పొగుల శారా ,రాధ తదితరులు పాల్గొన్నారు.