contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

IECopHBS నారాయణరావు లే అవుట్ లో … కబ్జాల పర్వం .. పట్టించుకునే నాధుడే లేడు

  • అధికారుల హస్తం ఉందంటున్న స్థానికులు
  • ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరం
  • (IECopHBS) ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హోసింగ్ బిల్డింగ్ సొసైటీ భూమిలో ఫోర్జరీ లే అవుట్లు..
  • భూ మాఫియాని ఆపే నాధుడే లేడా … ?

హైదరాబాద్ ఆమీన్పూర్ మున్సిపాలిటీలో భూ కబ్జాదారులు రెచ్చిపోర్టున్నారు. ఇబ్బడి ముబ్బడిగా లే అవుట్ లు చేస్తూ గోనుగోలుదారుల నెత్తిన టోపీ పెడుతున్నారు. (IECopHBS) భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోర్టున్నారు. దర్జాగా తన్నుకుపోరుతున్నారు. కోటానుకోట్ల విలువ చేసే నారాయణరావు లే అవుట్ లో భూమి ఈ విధంగా అన్యాక్రాంతం అయిపోవడం ఆందోళనకు గురిచేస్తోందని స్థానికులు వాపోతున్నారు. తాజాగా అమీన్ పూర్ లో కళ్ళు బైర్లు కమ్మే ఒక అవినీతి వ్యవహారం వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ది రిపోర్టర్ టివి చేసింది.

1984 లో హైదరాబాద్ , పటాన్చెరు , అమీనాపూర్ నారాయనరావు లే అవుట్, ప్రభుత్వ అనుమతితో వేయడం జరిగింది. అందులో 1984 నుండి 1996 వరకు ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది. ఈ లే అవుట్ లో సుమారు పదిహేను వందల ప్లాట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్లాటు 500 వందల గజాల చొప్పున విస్తీర్ణం లో ఉంది. మొత్తం 283 ఎకరాల లే అవుట్ ఇది. ఆయితే 1996 పఠాన్ చెర్వు ఎమ్మార్వో ఆ లే అవుట్ ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని ప్రకటిస్తూ , నారాయణ రావు లే అవుట్ భూమి ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ లే అవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇది అన్యాయం అంటూ కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన కేసు కోర్టు పరిధి లో ఉంది. ఆయితే విచిత్రంగా ఈ భూమిలో తిరిగి లే అవుట్లు వేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 1996 నుండి సుమారు 283 ఎకరాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతుంది. ఫోర్జరీ లే అవుట్ లకి అనుమతులు ఏవిధంగా వచ్చాయో ..? అర్ధం కావటం లేదు. కోర్టు పరిధిలో పెండింగ్ లో ఉన్న భూమిలో సర్వేలు జరగడం, లే అవుట్స్ వేయడం అంతా వింతగా, మాయగా ఉంది. కబ్జా దారులకు ఇంతటి ధర్యం ఎక్కడినుంచి వచ్చిందో ..? జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఒకసారి ప్లాటింగ్ అయిన స్థలం లో సర్వే చేయడం, పైగా ఫోర్జరీ లే అవుట్ లకి సర్వే చేయడం హాస్యాస్పదంగా ఉంది. మరో విచిత్రం ఏమిటంటే సంబంధం లేకుండా సివిల్ సిటీ కోర్టు నుండి తెచ్చిన ఫైనల్ డిగ్రీ ఎలా చెల్లుతుంది..? అసలు ఈ వ్యవహారానికి సిటీ సివిల్ కోర్టుకు ఏమిటి సంబంధం ..? ఒకసారి లే అవుట్ చేయబడి రిజిస్టర్ అయి ప్లాట్లు ఉన్న భూమిని అధికారులు మల్లి ఎలా స్వాధీనం చేసుకుంటారు ..? 2008 లో ఫైనల్ డిగ్రీ వచ్చిన వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వ్ చేసి వారి హద్దులు నిర్ణయించి వారికి పట్టా ఇవ్వకముందే 2007 లో క్రయ వికర్యాలు ఎలా జరుగుతాయి ..? ఫోర్జరీ లే అవుట్ కు అధికారులు ఎలా తాము అండగా ఉంటారు ..? (IECopHBS)నారాయణ రావు లే అవుట్ లో ప్లాట్స్ కొన్న వారు సమస్యను కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. కోర్టు .. వారికి .. అనుకూలంగా 21/2/ 2014 ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగిది. అయితే చిత్రంగా ఇప్పుడు ఆ భూమిని కబ్జా చేసి కొత్త లే అవుట్ లు వేస్తున్న వ్యక్తులు కూడా కోర్టులో తమకు అనుకూలంగా ఆర్దర్లు తెచ్చుకోవడం జరిగింది. ఇదెలా సాధ్యం అయింది…? అంటే కోర్టును కూడా ఏమార్చే సాహసం కూడా కబ్జాదారులు చేసారా ..? ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన బహిరంగ సత్యాలు .. నారాయణ రావు లే అవుట్ లో దర్జాగా కబ్జా చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న అధికార గణాన్ని కఠినంగా శిక్షించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. అమీన్ పూర్ తహసీల్దార్ నారాయణ రావు లే అవుట్ వ్యవహారం మీద స్పందించి (IECopHBS) నారాయణ రావు లేఔట్ భూమి ఆక్రమణల పర్వం మీద, కోర్టు లో ఉన్న వ్యవహారాల వివరాలను ప్రజలకు తెలియజేయకపోతే … కబ్జాదారుల కోరలు పీకేయడానికి ది రిపోర్టర్ టివి న్యాయపోరాటానికి సిద్ధమని హెచ్చెరుస్తూ … మరో బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకొస్తాం …

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :