సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ లో మున్సిపల్ కమిషనర్ సుజాత అవినీతి అక్రమాలకు తెగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి విధి , విధానాలను తాకట్టు పెడుతోంది. నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ వెంచర్లు వేస్తున్న ” ఎ ఆర్ ” డెవలపర్స్ కు వంత పాడుతూ … ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రజలను నిండా ముంచుతోంది. సర్వే నంబర్ 1003, 1004, 1057,1060, 1062, 1063 లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిర్మాణాలకు అనుమతులుండవు … అడిగే వారు అసలే లేరు. ప్రభుత్వ నిబంధనలతో పనిలేదు. అంతా నిర్మాణదారులు ఇష్టారాజ్యం. మున్సిపాలిటీలలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా, సజావుగా జరిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 లో నూతనంగా ప్రవేశ పెట్టిన మున్సిపాలిటీ చట్టం, ఇక్కడ అధికకారులకు, ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు పుట్టగొడుల్లా పెరగడం తో .. ఈ చట్టం బ్రష్టు పడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.
అమీన్ పూర్ మున్సిపాలిటీ కేంద్రంగా మున్సిపాలిటీ నుండి అనుమతులు లేకుండా, 2018 కంటే ముందు గ్రామా పంచాయతీగా ఉన్న సమయం లోనే ఎటువంటి నిర్మాణాలు లేకున్నా , దొడ్డిదారిలో పొందిన ఇంటి నెంబర్లతో, ప్రస్తుతము అక్రమ నిర్మాణ పనులు చేస్తూ .. కోట్ల రూపాయల భూములను కొల్లకొట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపణలు లేకపోలేదు ..
అమీన్ పూర్ మున్సిపాలిటీలో ఇంటి నంబర్లు జారీచేయాలంటే మొదట ఇంటి నిర్మాణ అనుమతులు పొందాలి. మున్సిపల్ చట్టం ప్రకారం ఇంటి నెంబర్ పొందాలన్నా, నిర్మాణ అనుమతులు పొందాలన్నా సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్, ఆక్యు పెన్సి సర్టిఫికెట్, సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధనలతోపాటు చట్టంలో చూపించిన పాత్రలతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చట్టం సూచిస్తోంది. కానీ మున్సిపల్ చట్టాన్ని ఆ శాఖలోని కొందరు అధికారులు కాలరాస్తూ, అక్రమాలకు పాలుడతున్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటి నెంబర్ కోసం ధరఖాస్తూ చేసుకున్న ప్రదేశాన్ని పరిశీలించి, రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమా ? కాదా ? భవనాలు ఉన్నాయా ? లెవా ? అని నిర్ధారణ చేసుకొని ఇంటి నంబర్ కేటాయించాల్సి ఉంటుంది, నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అవినీతిలో కూరుకు పోయిన మున్సిపల్ కమీషనర్ సుజాత ఇవన్నీ పట్టించుకోకుండా, అక్రమార్జనే పరమావధిగా భావించి .. విచ్చలవిడిగా అనుమతులు జారీ చేస్తున్నారనే ప్రచారం ఈ ప్రాంతంలో జోరుగా సాగుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతం కావడం తో ఎకరం భూమి విలువ కోట్లల్లో ధర పలకడం తో … రియల్టర్లు అక్రమ వెంచర్ల నిర్మాణం సాగించి. కోట్లు కొల్లగొడుతున్నారు..
2018 కంటే ముందు గ్రామా పంచాయతీగా ఉన్న సమయంలో పొందిన ఇంటి నెంబర్లతో “ఏ.ఆర్” డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ, అక్రమాలను సక్రమం చేస్తూ నకిలీ పత్రాలతో అక్రమ లే అవుట్లను చూపుతూ … యథేచ్ఛగా వక్రమార్గంలో అక్రమ నిర్మాణాలు చేస్తుంటే .. అమీషనర్ అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు సైతం వ్యక్తమవుతున్నాయి. అమీన్ పూర్ మున్సిపాలిటీ లో నిర్మాణ అనుమతులు పొందాల్సిన “ఏ.ఆర్” డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ, గ్రామ పంచాయతీ ఇంటి నంబర్ల తో ఎలా నిర్మాణ పనులు చేస్తున్నారని అటు వెళ్లే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అసలు “ఏ.ఆర్” డెవలపర్స్ లే అవుట్ అనుమతులు ఎక్కడ నుండి వచ్చాయి …. ? సదరు సర్వే నంబర్లు ఏ అధికారి కస్టడీలో ఉన్నాయి ..? ఈ సర్వే నంబర్ భూమిలో నిర్మాణ పనులు చేయవచ్చా …? అసలు “ఏ.ఆర్” డెవలపర్స్ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు ఏమి చెప్తున్నాయి…? “ఏ.ఆర్” డెవలపర్స్ లో స్థానిక నాయకుల పాత్ర ఏంటి ..? ఈ అక్రమ లే అవుట్ కి సంబంధించిన వ్యవహారాల పై, మున్సిపల్ అధికారులు చేస్తున్న అక్రమ ఆగడాల పై మరో స్టోరీతో మీ ముందుకొస్తుంది.. ది రిపోర్టర్ టివి…