టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన కొడుకు లోకేశ్ ను అదుపులో పెట్టుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సూచించారు. ఈ వయసులో కొడుకును కట్టడి చేయకపోతే సభ్యతగా ఉండదని, సమాజం కూడా హర్షించదని పేర్కొన్నారు. లోకేశ్ కు ట్విట్టర్ తేరగా దొరికిందని, దాంతో ఇష్టంవచ్చినట్టు ట్వీట్లు చేస్తున్నాడని పేర్ని నాని విమర్శించారు. లోకేశ్ ఇష్టారాజ్యంగా కారుకూతలు కూస్తున్నాడని మండిపడ్డారు.
నాడు లోకేశ్ కు మంత్రి పదవి ఎలా వచ్చిందని అన్నారు. లోకేశ్ కు మంత్రి పదవి కోసం ఐదుగురు మంత్రులను తొలగించారని నాని ఆరోపించారు. చంద్రబాబు పాలన యావత్తు దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయిందని, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ దందా సాగించారని తెలిపారు.