అమీన్పూర్: తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సండే మార్కెట్లో గల ఐలమ్మ విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పూలమాల వేసి ఘన గల నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణను సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.