- భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24వ జాతీయ మహాసభలకు విరివిగా విరాళాలు ఇవ్వండి.
- ఎ. మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి.
పల్నాడు జిల్లా; నరసరావుపేట: పేద ప్రజలు కార్మికుల కోసం కష్టజీవులు కోసం వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడే భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలు విజయవంతం చేయుటకు ప్రజలందరూ విరివిగా విరాళాలు ఇచ్చి తోడ్పడవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సీ పీ ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు ఉదయం 11 గంటలకు నరసరావుపేట పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మారుతి మాట్లాడుతూ అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడ నగరంలో జాతీయ మహాసభలు జరగనున్నాయని ప్రారంభమైన 14వ తేదీన రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేయు కార్మిక జనసంద్రంతో మహాప్రదర్శన జరగనుందని అనంతరం గొప్ప బహిరంగ సభ జరుగుతుందని ఈ బహిరంగ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కే నారాయణ, సిపిఐ జాతీయ పూర్వపు ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బినయ్ విశ్వం, సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, సిపిఐ తెలంగాణ కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు, కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు, కామ్రేడ్ జెవి సత్యనారాయణ రాజు తదితర ఇతర వామపక్ష నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు, బహిరంగ సభ ప్రారంభంలో ప్రముఖ సినీ గేయరచయిత సంగీత దర్శకుడు ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ విప్లవ గేయాలు ఆలపించెదరు. కావున పల్నాడు జిల్లాలోని ప్రజలు కార్మికులు కష్టజీవులు ఉద్యోగులు మహిళలు యువకులు వేల సంఖ్యలో ఈ ప్రదర్శన బహిరంగ సభలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. కార్యకర్తలందరూ ప్రజలందరి వద్ద వీధి కలెక్షన్లు ఇంటింటికి తిరిగి విరాళాలు వసూలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ మహాసభలకు విజయవాడ నగరం ఐదు రోజులు ఆతిధ్యం ఇస్తున్నందున మహాసభ ఆద్యంతం ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలు ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తున్నందున ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులతో కూడుకున్నందున ప్రజలే ఈ మహాసభలను విజయవంతం చేయవలసి ఉన్నదని, ప్రజలందరూ కార్మికులు కష్టజీవులు విరివిగా విరాళాలు ఇచ్చి మహాసభలు విజయవంతానికి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, పార్టీ కార్యవర్గ సభ్యులు ఉప్పలపాటి రంగయ్య, పట్టణ కార్యదర్శి వైదన వెంకట్, శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.