- నిరుపేదలకు అండగా నేనుసైతం
- నేనుసైతం ఆధ్వర్యంలో చీరల పంపిణీ
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండలంలో నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దసరా పండగను పురస్కరించుకుని ముసాపేట మండలంలోని నిరుపేద మహిళలకు, ఒంటరి మహిళకు, వృదులకు చీరలను పంపిణీ చేశారు. మూసాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులు వసంత, దేవంషు కుమార్, సుధాంషు కుమార్, పద్మావతిలతో కలసి ఈ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
చీరల పంపిణీ అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ నిరుపేదలకు నేనుసైతం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. అనునిత్యం అవినీతి, అక్రమాలపై పొరదడమే కాకుండా, సేవా కార్యక్రమాల్లో సైతం నేనుసైతం ముందుంటుందని సామాజిక కార్యకర్త ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సలాం, పాషా, రామస్వామి, రామంజి, నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు జి. శేఖర్, శెట్టి శ్రావణ్, మాజీ ఎంపీటీసీ మచ్చేండర్, ముసాపేట ఉప సర్పంచ్ తాజ్, హర్షద్, వంశీ, ఖాదర్, సిరాజ్ లతో పాటు నాగమ్మ, నీలమ్మ, తాళ్లగడ్డ లక్ష్మి, వెంకటమ్మ, సక్కుభాయీ తదితరులు పాల్గొన్నారు.