హైదరాబాద్ మహానగరంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చారు. వీటిలో భాగంగా పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తూ రూ.600 ఫైన్ విధించనున్నారు. సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ దాటితే ఇకపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. స్టాప్ లైన్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధిస్తారు. ఇకపై ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేసే వాహనదారులకు రూ.1000 ఫైన్ పడనుంది. ఫుట్‌పాత్‌లపై ఎవరైనా దుకాణదారులు వస్తువులు పెడితే వారికి కూడా ఇక నుంచి భారీ జరిమానా తప్పదు.