హైదరాబాదులో పండగ సీజన్ సందర్భంగా భారీ పేలుళ్ల కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ ) భగ్నం చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన ఎన్ఐఏ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా నాలుగ గ్రనేడ్లను కూడా స్వాధీనం చేసుకుంది.
అయితే ఈ గ్రనేడ్లు ఎక్కడివన్న విషయంపై పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. కొన్ని నెలల కిందట వీటిని పంజాబ్ వద్ద సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు జారవిడిచినట్టు భావిస్తున్నారు. అంతేకాదు, వాటిపై మేడిన్ చైనా అని రాసివున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధాలు ఇక్కడిదాకా ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో పాకిస్థాన్ ఆయుధాలు హర్యానా నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ కు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా మీదుగా చేరాయని, ఇప్పుడు కూడా అదే రీతిలో గ్రనేడ్లు వచ్చి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.