మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బుధవారం రైలులో ప్రయాణించారు. గడచిన రెండు రోజులుగా తన సొంత జిల్లా నెల్లూరు వచ్చిన వెంకయ్య… ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఏర్పాటు చేసిన సన్మాన సభలకు హాజరయ్యారు. బుధవారం నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకున్న వెంకయ్య చెన్నై బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన రైలు ప్రయాణాన్ని ఆశ్రయించారు. నెల్లూరు జిల్లాలోని గూడురు రైల్వే స్టేషన్కు చేరుకున్న వెంకయ్యకు అక్కడి స్థానికులు వీడ్కోలు చెప్పగా… రైల్వే స్టేషన్లో ఆయన కొద్దిసేపు రైలు కోసం వేచి చూశారు. ధనాపూర్-బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలు రాగానే…అందులోకి ఎక్కిన వెంకయ్య చెన్నై బయలుదేరి వెళ్లిపోయారు.