జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై టీడీపీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు (Kala Venkatarao) విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విజయనగరం మహారాజా ఆసుపత్రి పేరు మార్పును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏ పరిపాలనలో చూడలేదని మండిపడ్డారు. ”ప్రభుత్వ పథకాలకు ఎన్నో పేర్లు పెట్టారుగా ఇంకా చాలవా?.. ఆర్ అండ్ బి రోడ్లుకు చేపల చెరువు రోడ్లని పేరు పెట్టoడి… ఏ ఊరిలో ఎవరి పేర్లు ఉండకూడదు మీ నాన్నగారి పేరు నీ పేరు ఉంటే చాలు.. ప్రభుత్వానికి దాతలు స్థలం ఇస్తే వాళ్ల పేర్లు పెట్టుకుంటే ఆ పేరు తీస్తే నీకేంటి లాభం?.. ఈ పేరు మార్పులను కక్షపూరితంగా చేస్తున్నారు.. దీని వల్ల సాధించింది ఏంటి?.. ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి స్పృహ ఉంటే విజయనగరంలో ఆ ఆస్పత్రికి పాత పేరును కొనసాగించాలి” అంటూ కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు.
