అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రభుత్వం ఆంబులెన్స్‌లు లేక జనం నానా ఇబ్బందులు పడుతున్నా..జగన్‌కు చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. జెండా ఊపి ఊరేగించిన అంబులెన్సులు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. పాముకాటుకు చనిపోయిన తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం దిగువ పుత్తూరుకి చెందిన ఏడేళ్ల బసవయ్య మృతదేహాన్ని బండిపై తండ్రి తీసుకెళ్లిన ఘటన జగన్ అమానవీయ పాలనకి నిదర్శనమని పేర్కొన్నారు. సర్కారు అంబులెన్సులు రాక, ప్రైవేటు వాహన యజమానులు డిమాండ్ చేసే డబ్బును నిరుపేదలు ఇచ్చుకోలేక .. జనం నరకాన్ని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు ఓటేసిన పాపానికి కుటుంబసభ్యులు గౌరవంగా అంత్యక్రియలు చేయలేని దౌర్భాగ్య స్థితి దారురించడం దురదృష్టకమన్నారు నారా లోకేష్.