మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు తెరాసను ఓడించకుంటే కేసీఆర్ అహం తగ్గదని భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.మునుగోడులో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం సుపరిపాలన అందించి ఉంటే తెరాస ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఒక్కో ఇన్‌ఛార్జిని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక మాదిరిగానే మునుగోడులోనూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. తెరాస నేతలకు ప్రజాదరణ లేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.