భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ టి రవీందర్ కుటుంబానికి లక్ష రూపాయలను చెక్కు రూపంలో ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ అందజేశారు.మణుగూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ అనారోగ్యంతో మరణించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నిరంతరం విధులలో నిమగ్నమై శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడే పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల కూడా ప్రత్యక్షత వహించాలని విజ్ఞప్తి చేశారు.