మంగపేట: ములుగు జిల్లాలోని తిమ్మంపేటలో దుప్పి మాంసం అమ్మడానికి తీసుకెళ్లున్న వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. 30 కిలోల దుప్పి మాంసంతోపాటు ఆటోలో తరలిస్తున్న రెడ్డి కిరణ్ అనే ఆటో డ్రైవర్ ను శుక్రవారం మంగపేట ఫారెస్ట్ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబందించి మంగపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎండి.షకీల్ పాషా తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.పస్రా అటవీ రేంజ్ ప్రాంతంలోని కొడిశాల నుండి తాడ్వాయి, కాటాపూర్ మీదుగా మంగపేట మండలానికి ఆటోలో దుప్పి మాంసం తరలిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో తనిఖీలు చెపట్టగా మండలంలోని తిమ్మంపేట గ్రామంలో రెడ్డి కిరణ్ అనే ఆటో డ్రైవర్ (టీఎస్ 04 యుబి 3526) తన ఆటోలో 30కిలోల దుప్పి మాంసం తీసుకెళ్తుండగా పట్టుకున్నాం.దీంతో ఆటోలో ఉన్న దుప్పి మాంసాన్ని, ఆటోను,ఆటో డ్రైవర్ రెడ్డి కిరణ్ ను అదుపులోకి తీపుకున్నట్లు రేంజ్ ఆఫీసర్ తెలిపారు.