- భూ వ్యవహారాలలో బాధితులు పై విరుచుకుపడ్డ తిరుచానూరు సీఐ – భయాందోళనలో బాధితులు
- ప్రముఖ పత్రికలో పనిచేయు విలేఖరి వివరణ కోరగా విలేఖరి పై దురుసుగా ప్రవర్తించిన తిరుచానూరు సిఐ
- కోర్టు ఇచ్చిన పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ను కూడా లెక్కచేయని వైనం
- తిరుచానూరు సిఐ పై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన బాధితులు
తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయితీ, దామినేడు లెక్కదాఖలాలో సర్వే నెం: 92/2 నందు 42 సెంట్ల భూమి M. వెంకటమునిరెడ్డి అతని తమ్ముళ్ళు M.వెంకటరమణ రెడ్డి, M.వెంకటసుబ్బారెడ్డి ముగ్గురు కలసి 1983 వ సంవత్సరంలో కొనుగోలు చేసి అప్పటి నుండి గత 40 ఏళ్ళుగా వారి అనుభవ ఆదీనంలో భూమిని కొందరు కబ్జాదారులు దౌర్జన్యంగా కబ్జాకు పాల్పడగా వారు గౌరవ 10th ADJ కోర్టు తిరుపతి లో కేసు వేసి 2019లో గౌరవ కోర్టువారు డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ డిడ్, పర్మినెంట్ ఇంజక్షన్ 155/2013 ఆండ్ OS156/2013 కూడా ఇచ్చిఉన్నా కూడా తప్పుడు డాక్యుమెంట్లో సృష్టించి మరల ఆ భూమిని కబ్జా చేయడానికి కొందరి కబ్జారాయుళ్ళ తో చేతులు కలిపి గౌరవ కోర్టు ఆర్డర్ ను కూడా బేకాతరు చేస్తే కోర్టు ధిక్కరణ నేరం అవుతుందని అన్న గౌరవం కూడా లేకుండా బాధితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతగల తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధితులను పోలీస్ స్టేషన్ కు పిలిచి మేము చెప్పే అంతవరకు ఆ స్థలంలో మీరు వెళ్ళకూడదు అంటూ హుక్కు జారీ చేసిన వైనం. దీనిపై వివరణ కోరిన విలేకరిపై దురుసుగా ప్రవర్తించి బాధితులను మరియు విలేకరిని భయాందోళనకు గురి చేయడం జరిగింది. పోలీస్ ఉన్నత అధికారులు భూ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని పలుమార్లు చెప్పినప్పటికీ పోలీస్ ఉన్నత అధికారుల మాటలను సైతం బేఖాతరు చేస్తూ పోలీస్ స్టేషన్ ను కోర్టుగా మారుస్తున్న ఇలాంటి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.