ఇద్దరు కోటీశ్వరులతో పోటీపడ్డారని, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతికి కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ కితాబు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా జైరాం రమేశ్ మాట్లాడుతూ..తెలంగాణలో భారత్ జోడోయాత్ర పదకొండు రోజుల పాటు 319 కిలోమీటర్లు, 8 జిల్లాల్లో సాగిందని తెలిపారు. దక్షిణ భారతంలో ఐదు రాష్ట్రాల్లో ఈ యాత్ర పూర్తి చేసుకుని.. ఈరోజు మహారాష్ట్రలోకి చేరుకుంటుందని అన్నారు. నేటితో దక్షిణ భారత యాత్ర ముగిసి.. రేపట్నుంచి ఉత్తర భారత యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి రాహుల్ యాత్రకు స్పందన లభించిందని అన్నారు. వారి వారి సమస్యలను వివరించారని, ఇది ఉపన్యాసాలిచ్చే మన్ కీ బాత్ కాదు.. ప్రజల సమస్యలు వినిపించుకునే యాత్ర అని ఎద్దేవ చేశారు. హైదరాబాద్ లో మా జోడోయాత్రకు విశేష స్పందన లభించిందని అన్నారు. ఒక మునుగోడు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ.. మునుగోడులో జరిగింది ఓట్ల ఎన్నిక కాదు.. నోట్ల ఎన్నిక అని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని చంపేసి మద్యం, ధనంతో గెల్చిన ఎన్నిక మునుగోడు అని అన్నారు. తెలంగాణాలో ఎన్నికలంటే వన్ సీర్ టూ మ సీఆర్ త్రీసీఆర్ ఫోర్ సీఆర్ కేసీఆర్ అంటూ ఎద్దేవ చేశారు. ఇక పాల్వాయి స్రవంతి బాగా పోరాడారని ఆమెకు అభినందించారు. మేం మునుగోడు విషయంలో చింతించడంలేదని అన్నారు.