పోలవరం మండల కేంద్రంలో గురువారం ఏలూరు విజిలెన్స్ అధికారులు ఒక గోడౌన్ పై దాడులు నిర్వహించి 3,100 కేజీల పిడిఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు విజిలెన్స్ సిఐ పి శివరామ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం పోలవరం మెయిన్ బజార్ లో ఒక వ్యాపారి అక్రమంగా పిడిఎఫ్ బియ్యం నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ,దాడుల్లో 62 సంచుల్లో మూడు టన్నుల, వందకేజీల పిడిఎఫ్ బియ్యం స్వాధీనం చేసుకుని వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు, బియ్యం విలువ 5,5000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో ఏలూరు విజిలెన్స్ ఎస్ఐ రంజిత్ కుమార్, పోలవరం యస్.ఐ పవన్ కుమార్ పోలవరం డిప్యూటీ తహశీల్దార్ ఎన్. ప్రసాద్, రెవెన్యు ఇన్స్పెక్టర్ కాజా రమేష్ వీఆర్వో దుర్గ ప్రసాద్, పోలీసు కానిస్టేబుల్ పాల్గొన్నారు.
