తెలంగాణలో కొన్ని రోజులుగా ఈడీ, ఐటీ శాఖల అధికారులు తీవ్ర స్థాయిలో దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. పలువురు టీఆర్ఎస్ నేతల నివాసాలు, కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు జరిపాయి. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులైన తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో విచారణ జరుపుతున్నారు. గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ అంశం టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఈ విచారణకు సంబంధించి మరిన్ని వివరలు తెలియాల్సి ఉంది.