పల్నాడు జిల్లా కారంపూడి : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన కారంపొడి పల్నాటి వీరరాఘవ ఉత్సవాలు జరిగాయి గత ఐదు రోజుల నుండి జరిగిన పల్నాటి వీరారాధన ఉత్సవాలకు వసతులు కరువైనట్లు చెప్పుకోవాలి ప్రజలు తాగేందుకు నీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి నెలకొంది నాగులూరు లో ఉన్న నీటిని స్థాన ఘట్టాలకు ఉపయోగించి అదే మురుగునీరు నాగులేరులోకి పంపించే విధంగా చేశారు నాగులేరులో ఆచారవంతులు స్నానం చేయటం ఆచారం అలాంటి ఆచారాన్ని కూడా అధికారులు విస్మరించారు. మహిళల కోసం మరుగుదొడ్లు లేక ఇబ్బందులకు గురైన సంఘటనలు ఉత్సవాలలో నెలకొన్నాయి. ఆచారవంతులకు కనీసం నిలువ నీడ కూడా లేకుండా పోయింది రాత్రుల సమయంలో చలిగాలులోనే వీర్ల దేవాలయ ప్రాంగణంలో బస చేశారు. ఆచారవంతులపై అధికారులకు ప్రజాప్రతినిధులకు కనీసం కనికరం కూడా లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. వీర్ల దేవాలయ ప్రాంగణంలో వివిధ స్టాల్స్,ఫాన్సీ, ఆట వస్తువులకు వేల రూపాయలు తీసుకుంటున్న కనీస వసతులు కల్పించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి డబ్బులు వసూలు చేసి ఎవరికి పెడుతున్నారు అనేది ఇంతవరకు అర్థం కాని పరిస్థితి.