- అసైన్డ్ భూమి ఆక్రమిస్తే ఆర్నెళ్ల జైలు.
- భూమిని ఎవరూ …. కొనరాదు.
లబ్ధిదారు వారసులే అనుభవించే హక్కు అమ్మరాదు.స్పష్టం చేస్తున్న పీవోటీ చట్టం – 1977 ఆన్లైన్డ్ భూములను ఎవరైనా ఆక్ర మించినా, కొనుగోలు చేసినా ఆర్నెళ్ల జైలు శిక్ష తప్పదని అసైన్డ్ భూముల బదలా యింపు నిషేధ చట్టం (పీవోటీ)-1977 స్పష్టం చేస్తున్నది.భూమి లేని నిరుపేద లకు ప్రభుత్వం సాగు చేసుకునేందుకు, లేదా ఇంటి నిర్మాణానికి ఇచ్చిన భూమిని అసైన్డ్ భూమిగా పేర్కొంటారు.
ఈ భూమిని లబ్ధిదారు, వారి వారసులు వారస త్వంగా అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంటుంది.
ఇతరుల పేర్ల మీదికి బద లాయించడం,అమ్మడం, దానం ఇవ్వడం,కౌలుకు ఇవ్వడాన్ని పీవోటీ – 1977 చట్టం నిషేధిస్తున్నది.
ఒకవేళ ఎవరైనా అసైన్డ్ భూములను కొన్నా ఈ చట్టం ప్రకారం వారికి ఎలాంటి హక్కులు దఖలు పడవు. ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు.
అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్టప్రకారం నేరం.
అది అసైన్డ్ భూమి అని కోర్టు తేల్చినా, ఆక్రమణలు కొనసాగిస్తే శిక్షార్హం అవుతుంది.
కోర్టు గరిష్ఠంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.2000 వరకు జరిమానా లేదా రెండు శిక్షలు కలిపి వేయవచ్చు.