చాలామంది యూట్యూబ్ లో చూసి చెడు వ్యసనాలకు నేరాలకు గొరాలకు పాల్పడుతున్న సంఘటనలు అక్కడక్కడ జరిగినట్లు మనం వింటున్నాం చూస్తున్నాం , అంతే కాకుండా స్మార్ట్ ఫోన్ కొన్నియ్యమని తల్లి దండ్రుల పై ఒత్తిడి చేసి కొన్నియ్యకుంటే ఆత్మ హత్యలు చేసుకున్న యువతి యువకులను విద్యార్థులను చూస్తున్నాం అదే స్మార్ట్ ఫోన్ తో ఆన్లైన్లో క్లాస్ లు విని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకున్న వారు కూడా లేకపోలేదు అలాంటి వారి కోవకు చెందిన వారిలో ఒక్కడు సాయి చరణ్ యూట్యూబ్ లో క్లాస్ లు విని ఏకంగా సెకండ్ అటెంట్ లో ఎంబిబిఎస్ సీట్ సాధించి అందరిచే శబాష్ అనిపించుకుంటున్నడు కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న బలరాం విజయ లక్ష్మి దంపతుల కు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు సాయి చరణ్ చిన్నప్పటి నుండి చదువులో ప్రతిభ కనబరి చేవాడు తల్లి దండ్రులు చెప్పుల దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు కరోనా వల్ల వీరు చాలా ఇబ్బందులు పడి అప్పుల పాలు అయ్యారు కుమారుడు 5 వ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలో చదివి ఆరు నుండి ఇంటర్ వరకు మోడల్ స్కూల్లో చదివాడు చరణ్ నానమ్మ చెవి కమ్మలు కుదువ పెట్టి 10 వేలు డబ్బులు ఇవ్వగా అందులో మిగతా 10 వేలు తన తoడ్రి సమకూర్చి ఇరువై వేలతో స్మార్ట్ ఫోన్ కొనివ్వడం జరిగిందని ఆరు వేలతో ఆన్లైన్లో ఎంబిబిఎస్ క్లాస్ లు తీసుకోవడం జరిగిందని సాయి చెపుతున్నాడు రోజు 18 గంటల వరకు కష్టపడి చదివి క్లాస్ లు విని రాంక్ సంపాదించి నట్లు అయితే చదివిoచడానికి తమ తల్లి దండ్రుల వద్ద ఆర్థిక స్తో మత సరిగ్గా లేదని దయచేసి దాతలు ప్రభుత్వం సహకరించాలని సాయి చరణ్ కోరుతున్నడు దాతలు ముందుకు వస్తే ఏంబి బి ఎస్ పూర్తి చేసి తను పుట్టిన గ్రామానికి సేవలు అందిస్తా అంటున్నాడు సాయి చరణ్