వినుకొండ వైయస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి పేదలకు ఎలాంటి ఇబ్బందులకు తావివ్వమని, లబ్ధిదారులకు అన్ని వసతులను సమకూరుస్తామని, ఊరికి దూరంగా ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతి ఒక్క నోరు మూయించేల, వారి కళ్ళు బయర్లు కమ్మేలా వినుకొండలోని వైయస్ఆర్ జగనన్న కాలనీని ఒక స్మార్ట్ సిటీలా తీర్చిదిద్దుతాని వినుకొండ నియోజకవర్గ శాసన సభ్యులు బ్రహ్మనాయుడు అన్నారు. ఆ అభివృద్ధి పనులలో భాగంగానే నేడు వైయస్ఆర్ జగనన్న కాలనీలో కరెంట్ సరఫరా నిమిత్తం 33/11KV విద్యుత్ సబ్-స్టేషన్ పనులను శంకుస్థాపన చేపట్టామన్నారు. త్వరలోనే ఈ కాలనీ నందు తారు రోడ్డు మరియు వైయస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణ పనులను కూడా చేపడతామన్నారు. నిర్మాణం చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాల పురోగతిని పరిశీలించి ఇక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సీఏం జగన్మోహన్ రడ్డి పేదలకు ఒకే సారి 32 లక్షల ఇళ్ళని నిర్మించే యజ్ఞాన్ని చేపట్టారని, అందులో భాగంగా వినుకొండ జగనన్న కాలనీ నందు 5,275 మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలను మంజూరు చేసి నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. లబ్దిదారులు కూడా దగ్గరుండి ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.