కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండలం : కడార్ల అనూష కోశాధికారి ఆధ్వర్యంలో అమెరికా లోని మిన్నాసోటా ఏరియా తెలంగాణా అసోసియేషన్ (మాటా) వారి ద్వారా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట పాఠశాలకు యాభై వేల విలువైన వస్తువులను ప్రధానం చేసినారు. పాఠశాల విద్యార్థులకు ఉపయోగడే
సౌండ్ సిస్టమ్,ప్రింటర్, కార్పెట్స్ మరికొన్ని ఇతర వస్తువులను అందచేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామల భాగ్య మాట్లాడుతూ ఎంతో ఎత్తుకు ఎదిగినా మాతృభూమి కి సేవచేయాలనే సదుద్దేశ్యంతో మాటా వారు పాఠశాల కు సహాయం చేసినందుకు మాటా అధ్యక్షులు పొన్న సురేష్ కి పాఠశాల తరుపున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసినారు. వారిచ్చిన వస్తువులను సక్రమంగా ఉపయోగించి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించగలుగుతామని తెలిపారు. ఆర్థిక సహాయం చేయడానికి కృషి చేసిన నాగరత్నం కి ఆత్మీయ సన్మానం చేసారు, గ్రామ ఎంపీటీసీ ఏలేటి స్వప్న చంద్రారెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తాను కూడా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇస్తూ పాఠశాలకు సున్నం వేయడానికి పదివేల రూపాయలు అందజేసారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి కట్టా రవీంద్రాచారి పాఠశాల సముదాయ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధ్య పాఠశాల విద్యాకమిటీ చైర్మెన్ గడ్డం సుమిత్ రెడ్డి, తల్లిదండ్రులు,పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.