హైదరాబాద్ : హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. వివరాల్లోకి వెళితే శ్రీనగర్ కాలనీ లో ఓ శాడిస్టు మహిళా హల్చల్ చేసింది. గత ఆదివారం 13 వ తేదీన సాయంత్రం సుమారు తొమ్మిది గంటల సమయం లో తన ఆఫీస్ లో సిస్టం పనులు చేస్తుండగా పక్క బ్లాక్ ఓనర్ కామన్ ఏరియా గేట్ కి తాళం వేసి నిర్బంధి హల్చల్ చేసింది. బాధితురాలు పోలీసు వారికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన చేరుకున్న పోలీసులను సైతం గడగడలాడించింది పరిస్థితి సృతిమించడం తో ఎస్సై శరత్ చంద్ర సంఘటన స్థలానికి చేరుకొని పోలీసుల సహకారంతో బాధిత మహిళను కాపాడినట్లు సమాచారం. బాధిత మహిళను నిర్బంధించి మానసికంగా హింసించినందుకు ఆమెపై కేసు నమోదు చేసి తగు న్యాయం చేయాలనీ కోరుతున్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది