పెడన అసెంబ్లీ నియోజకవర్గం గూడూరు మండలం లో శ్రీ దత్త కారుణ్య ట్రస్ట్ షిరిడి సాయిబాబా కళ్యాణమండపం నందు గూడూరులో వైఎస్ఆర్సిపి కార్యకర్తల జడ్పిటిసి ఎంపిటిసి పంచాయితీ పార్టీ కార్యవర్గ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ రైతు భరోసా పంపిణీ విషయంలోనూ వైయస్సార్ చేయూత తదితర పథకాల విషయంలోనూ రాష్ట్ర అభివృద్ధిలోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కార్యకర్తలు నాయకులు అందరూ సమిష్టిగా ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడి పని చేయాలని మంత్రి జోగి రమేష్ పార్టీ కార్యవర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ డ్రెస్ లలో మంత్రిని స్వాగతిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ కార్యక్రమంలో గూడూరు జడ్పిటిసి వేమూరి నాగార్జున ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు వైసీపీ మండల అధ్యక్షులు గోరిపర్తి రవి తదితరులు పాల్గొన్నారు