contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చలికాలంలో ఇవి తింటే డి విటమిన్ తగ్గదు

ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన విటమిన్ డి ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది. దాంతో చాలామందిలో విటమిన్ డి లోపం తలెత్తుతుంది. ఇలాంటి వాళ్లు సరైన పోషకాహారం తీసుకుంటే విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో కండరాలు, ఎముకలు, దంతాలు దృఢంగా ఉండాలంటే విటమిన్ డి తప్పనిసరి. అంతేకాదు, విటమిన్ డి మనిషి శరీరంలోని కాల్షియం, ఫాస్పేట్ వంటి ఖనిజలవణాలను కూడా నియంత్రిస్తుంది. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడి, ఆస్టియోపొరోసిస్ వంటి రుగ్మతలకు దారితీస్తుంది. ఎముకలు పెళుసుగా మారి తేలిగ్గా విరిగిపోతుంటాయి.

అంతేకాదు, పిల్లల్లో విటమిన్ డి లోపం తీవ్రస్థాయిలో ఉంటే రికెట్ వ్యాధికి దారితీస్తుందని, ఎముకలు గట్టిపడాల్సింది పోయి మెత్తబడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, విటమిన్ డి లోపాన్ని తేలిగ్గా తీసుకోరాదని వెల్లడించారు.

చలికాలంలో ఈ లోపాన్ని ఆహారంతో నివారించవచ్చని తెలిపారు. పుట్టగొడుగులు, సాల్మన్ చేపలు, టూనా చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, కమలా పండ్లు, ధాన్యాలు, కోడిగుడ్లు, క్యాబేజి, కాడ్ లివర్ ఆయిల్, బీఫ్ లివర్ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా విటమిన్ డి పొందవచ్చు.

ఆహారం ద్వారా కంటే సూర్యరశ్మిలో ఉండడం ద్వారా మరింత మెరుగైన రీతిలో ఈ కీలక విటమిన్ పొందవచ్చని, చలికాలంలో పగటి వేళల్లో వీలైనంత సమయం ఎండలో ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ విటమిన్ డి లోపం తీవ్రంగా ఉంటే డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే మాత్రల రూపంలో వాడాలని నిపుణులు స్పష్టం చేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :