- గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామం
- గామాలపాడు గ్రామం లో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ
- కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
*దాచేపల్లి లోని గామాలపాడులో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి , రాజ్య సభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ , పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు , శాసన సభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి , శ్రీ డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , శ్రీ బోల్లా బ్రహ్మ నాయుడు , ఎమ్మెల్సీలు శ్రీ జంగా కృష్ణమూర్తి , శ్రీ మురుగుడు హనుమంత రావు , జిల్లా పరిషత్ చైర్మన్ హెని క్రిస్టినా , గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏసురత్న , జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రముఖుల
ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… గాంధీజీ కలలు గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుందన్నారు. గ్రామల్లో సచివాలయాల ద్వారా పరిపాలనను ప్రజల వద్దకు తీసుకొచ్చాం.. సమస్యలు అక్కడే అక్కడే పరిష్కారం చేస్తున్నామని వివరించారు. సచివాలయం వాలంటీర్లు వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి చేస్తున్నాం… ఇవాళ ఈ వాలంటీర్లు వ్యవస్థను పక్క రాష్ట్రాల్లో అమలు చేయాలి అనుకోవడం శుభ సూచకమన్నారు. గతంలోఅధికారులు చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సచివాలయంలో ద్వారా పూర్తి పాలనను ప్రజల వద్దకు తెచ్చామని పునరుద్ఘాటించారు.
జగన్ మోహన్ రెడ్డి కన్న కలలు నిజం అయ్యాయని.. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటను గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నామని వివారించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర అందుతుందన్నారు. గ్రామాల్లో విలేజ్ హెల్త్ సెంటర్ ద్వారా వైద్య సేవలు పూర్తిగా అందిస్తున్నాం అన్నారు. గామాలపాడును అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ.. జంగా కృష్ణమూర్తి జన్మ భూమి రుణం తీర్చుకుంటున్నారు అని ప్రశంసించారు.