- కులం పేరుతో దూషించిన పెద్దమందడి మండల జడ్పిటిసి రఘుపతి రెడ్డి.
- పెద్దమందడి పోలీస్ స్టేషన్ లో జడ్పిటిసి పై బాధితుడు ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ ఫిర్యాదు.
- కేసు నమోదు కాకుండా బాధితునికి బుజ్జగింపులు.
- జెడ్పిటిసి పై చట్టపరమైన చర్యలు తీసుకుని, పదవి నుండి తొలగించాలని దళిత సంఘాల డిమాండ్.
వనపర్తి జిల్లా పెద్దమందడి: అతను ఓ ప్రజా ప్రతినిధి, అసలే అధికార పార్టీ నేత ఇంకేముంది అతని నోరు కు అడ్డు అదుపు లేకుండా పోయింది. పెద్దమందడి మండల జడ్పిటిసి రఘుపతి రెడ్డి తన అధికార బలంతో వెల్టూర్ గ్రామానికి చెందిన నరాల ఆంజనేయులు అనే వ్యక్తినీ కులం పేరుతో దూషించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి నరాల ఆంజనేయులు జడ్పిటిసి ఇంటికి వెళ్లి దళిత బంధు గురించి అడగగా కులం పేరుతో దూషించాడని బాధితుడు ఆదివారం రాత్రి జెడ్పిటిసి రఘుపతి రెడ్డి పై పెద్దమందడి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. బాధితుడు కేసు పెట్టడానికి వెళ్తున్న సమాచారంతో మధ్యవర్తులను పంపి ఒక రోజంతా కాలయాపన చేస్తూ బుజ్జగింపు చేసే ప్రయత్నం, సంఘటన బయటికి రాకుండా కేసు నమోదు కాకుండా జాగ్రత్తపడ్డారు. మధ్యవర్తులతో కాలయాపన చేస్తూ తిరిగి బాధితుడి పైనే కేసు నమోదు చేయడం జరిగింది. ఆదివారం ఉదయం ఆంజనేయులు పై ఫిర్యాదు చేయగా అతని ఫోన్ ట్రాప్ చేసి పోలీసులు మధ్యాహ్నం 3 గంటల్లోపు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కులం పేరుతో దూషించిన జడ్పిటిసి రఘుపతి రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకొని, పదవి నుండి తొలగించాలని ఎమ్మార్పీఎస్, డీఎస్పీ దళిత సంఘాల డిమాండ్. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.MRPS జిల్లా కన్వీనర్ రాజనగరం రాజేష్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు కొమ్ము చెన్నకేశవులు, DSP నాయకులు పాల్గొన్నారు.