- కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అధికారులు
- అధికారుల హస్తం ఉందంటున్న స్థానికులు
- పట్టించుకోని బొల్లాపల్లి ఎమ్మార్వో
- ఆర్ & బి డీఈ కి చెప్పమంటున్న ఫారెస్ట్ అధికారి
- నాకు ఎటువంటి సమాచారం లేదంటున్న బొల్లాపల్లి ఎమ్మార్వో
- స్థానిక ఎంపిటిసి హస్తమున్నట్టు సమాచారం
- జర్నలిస్టులమని చెప్పుకుని తిరిగేవాడు అండగా ఉన్నారని సమాచారం
మాయగాళ్లు అనే పదానికి సరైన ఉదాహరణ వీళ్లే.. మరీ అంత దోపిడియా..? ఇంతకీ ఏం చేశారంటే..! పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు గ్రామా శివారులో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. మేళ్ళవాగు మెయిన్ రోడ్డు పక్కన అటవీశాఖ బంగ్లా పక్కన వినుకొండ హైదరాబాదు కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆర్ & బి భూమిలో అక్రమ నిర్మాణం చేసి రెస్టారెంట్ నడుపుతన్నారు. రెస్టారెంట్ మాత్రమే కాక అక్కడ అక్రమ మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం.
కానీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అటవీశాఖ వారు మాత్రం ఆ భూమి మాది కాదని, ఆర్ & బి వారికి తెలియజేశామని, ఆర్ & బి డీఈ బొల్లాపల్లి ఎమ్మార్వోకి తెలిపితే నేటికీ చర్యలు తీసుకోవటం లో జాప్యం చేస్తున్నారని అన్నారు. ఈ విషయం పై బొల్లాపల్లి ఎమ్మార్వో ని అడిగితె నాకు ఎటువంటి లెటర్ రాలేదని బుకాయించాడు. ఇకనైనా అధికారులు స్పందించి దర్జాగా కబ్జా చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.