కొమురంభీం: తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధినేత్రి మాయావతి,రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ నాయకత్వం పటిష్టంగా ఉందన్నారు.ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలపై ద్రుష్టి పెట్టామన్నారు. బీఎస్పీ బలమైన శక్తిగా అవతరిస్తోందని స్పష్టం చేశారు.కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాణహిత ప్రాజెక్టు ప్రాణం తీశారని మండిపడ్డారు.వెనుకబడ్డ జిల్లాను మరింత వెనక్కి నెట్టారని వ్యాఖ్యానించారు.