పల్నాడు జిల్లా కారంపూడి : తహసీల్దార్ కార్యాలయం ముందు మందు బుడ్లతో ఆందోళనకు దిగిన పేటసన్నేగండ్లకు చెందిన సుగాలి నాయకుడు రామావత్. హనుమానాయక్ పురుగుమందు బాటిల్ తో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన వ్యవహారమై తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ ను వివరణ కోరగా పేటసన్నేగండ్ల తండాకు చెందిన హనుమానాయక్ భూమి వ్యవహారం ఆది సింగరెట్ల దేవాలయానికి సంబంధించిన దేవాదాయ భూమి అని హనుమానాయక్ కుటుంబసభ్యులు కొన్ని ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నారని హనుమానాయక్ కుటుంబసభ్యులే స్వయంగా శ్రీచక్ర సిమెంట్స్ సంబంధించిన వారికీ అమ్మినట్లు తెలిసిందని వాస్తవంగా దేవాలయ భూములు అమ్మే అధికారం కానీ కొనే అధికారం కానీ ఎవరికీ లేదని ఒక వేళ శ్రీచక్ర సిమెంట్స్ ఫ్యాక్టరీ వారు ఆ భూమిని కొన్నట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని అవసరమైతే పోలీసు కేసు కూడా నమోదు చేయటం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా సదరు ధర్నా కి దిగిన వ్యక్తి గతంలో కూడా ప్రభుత్వ భూములు. స్వాధీనపర్చుకునే క్రమంలో కూడా వారి కుటుంబ సభ్యులకి అతనికి కుటుంబ గొడవలు.జరిగాయని అందుకే ఇవ్వన్నీ జరుగుతున్నట్లు తెలుస్తోంది !
