పెద్దవడుగూరు: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులు రహదారి భద్రతా నియమాలు తప్పక పాటించాలని గుంతకల్లు ఆర్టీవో రాజా బాబు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీటు బెల్టు, హెల్మెట్ ధరించడం రోడ్డు ప్రమాదాల నివారించవచ్చని తెలిపారు అలాగే మద్యం తాగి వాహనం నడపడం, మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. 18 ఏళ్లు దాటిన వారంతా చట్టపరంగా మోటార్ వెహికల్ లైసెన్సులను తీసుకోవాలన్నారు. డ్రైవింగ్ వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. వాహనాలు కండీషన్లో ఉండకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తున్నాయని చెప్పారు. ప్రయాణంలో మొబైల్ వాడకం, మద్యపానం, అతి వేగం వల్ల ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు.