సంగారెడ్డి : మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి. సదశివాపేట లో గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యం తో బాధపడుతున్న సంగీత అనే మహిళ ఇంటికి వెళ్ళి పరామర్శించి 50 వేల ఆర్ధిక సహాయం చేసారు. ఆమె గత కొన్ని ఏళ్లుగా షుగర్, బీపీ తో ఇబ్బందులకు గురై, తరచు డైలాసిస్ చేసుకుంటూ, ఇటీవలే ఆమె కాళ్ళు సచ్చుపడి మంచానికే పరిమితమైంది. ఈ విషయం జగ్గారెడ్డి దృష్టికి రావడంతో తన అనుచరుడితో సమాచారం తెలుసుకొని, ఇంటికి వెళ్ళి ఆమె ఆరోగ్యా పరిస్థితి తెలుసుకొని, ఎలాంటి అవసరం ఉన్న చూసుకోవాలని తన అనుచరుడికి చెప్పి, ఆర్ధికంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చి , తాత్కాలికంగా 50 వేల ఆర్ధిక సహాయం చేసారు.
