- శ్రీవిజయేంద్ర సరస్వతి స్వామిచే ఉత్తమ జ్యోతిష్య పండిత సత్కారాన్నందుకున్న చక్రధర సిద్దాంతి.
తిరుపతి: జ్యోతిష్య పండితులుగా రాష్ట్ర నందీఅవార్డు నందుకున్న సిద్దాంతి చక్రధర్.., మరో సారి తనప్రతిభాపాఠవాలతో సరస్వతీ పుత్రునిగా ఉత్తమ జ్యోతిష్య పండితుడిగా అవార్డునందుకున్నారు. తిరుపతిలో రెండురోజుల పాటు జరిగిన రాష్ట్రీయ జ్యోతిష్య సమ్మేళనంలో కంచికామకోటి జగద్గురువులు శ్రీవిజయేంద్ర సరస్వతి స్వామి వారిచే ఈ అవార్డును అందుకుని, విజయేంద్ర సరస్వతి స్వాముల వారి ఆశ్శీసులు పొందారు.ఈ సందర్భంగా సిద్దాంతి చక్రధర్ మాట్లాడుతూ ఉత్తమ జ్యోతిష్య పండితులుగా కంచికామకోటి జగద్గురువులు శ్రీవిజయేంద్ర సరస్వతి స్వామి వారిచే అవార్డు,సత్కారాన్ని పొందడం తన పూర్వజన్మ సుకృతంగా బావిస్తున్నట్లు చెప్పారు. సమాజహితం కోరేది జ్యోతిష్యమని, దీన్ని భావితరాలకు అందించడమే తన ధ్యేయమన్నారు.అంతేకాక సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు.అలాగే జ్యోతిష్య విలువల్ని ప్రపంచానికి తెలియజేస్తానని చక్రధర్ తెలిపారు.తిరుపతి వేదికగా జరిగిన రాష్ట్రీయ జ్యోతిష్య సమ్మేళనం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పిన సిద్దాంతి.., కంచికామకోటి జగద్గురువులు శ్రీవిజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆదేశాలను తుచా తప్పకుండా పాటిస్తూ..,సమాజశ్రేయస్సు కోసం పని చేస్తానని తెలియజేసారు.