పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం, అర్తం గ్రామ సమీపంలో గల అటు ఒడిశాతో పాటు మూడు రాష్ట్రాలకు వెళ్లే అంతరాష్ట్ర రహదారి మార్గంలో పెద్ద పెద్ద గోతుల వద్ద నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి గురువారం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ…. పార్వతీపురం నుండి కోమరాడ మీదుగా కున్నీరు వెళ్లే మూడు రాష్ట్రాల అంతరాష్ట్ర రహదారి మార్గంలో అర్తం గ్రామ సమీపంలోనూ మరియు కోటిపాము, కొమరాడ, బంగారం పేట గ్రామాల వద్ద అంతరాష్ట్ర రహదారి మార్గంలో పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో ప్రతిరోజు ఆ గోతులలో అనేకమంది అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు ఇప్పటికే గోతుల్లో ప్రమాదాలకు గురై కాలు చేతులు విరిగిపోయాయి ఆస్పత్రిలో పాలై పరిస్థితి ఉందని అలాగే గడిచిన మూడు రోజుల క్రితం పెద్ద లారీ ఆ గోతిలో పడి ప్రమాదానికి గురై పొలాల్లో పడిపోయే పరిస్థితి ఉందని అలాగే గురువారం రాత్రి 12 గంటల ప్రాంతంలో బంగారంపేట గ్రామ సమీపంలో గల అంతరాష్ట్ర రహదారి గోతిలో రాయగడ నుండి శ్రీ మజ్జి గౌరమ్మ తల్లి దేవాలయం కు వెళ్లి విశాఖపట్నం కారుతో వెళ్లే ప్రయాణికులు పెద్ద గోతులు పడిపోవడంతో ఆ కారు పూర్తిగా మరమ్మత్తుకు గురికావడంతో రాత్రివేళ 5వేల రూపాయలు ఇచ్చి టాక్టర్ తో పార్వతిపురం వరకు రాత్రి తరలించే పరిస్థితి ఉందని ఇదే కాదు ప్రతిరోజు పరిమితికి మించిన పెద్దపెద్ద లారీలు, వాహనాలు అటు మూడు రాష్ట్రాల వాహనాలు లారీలు, గుమ్ముల్లో బోల్తాపడటంతో ప్రమాదం గురై ఇలా పార్వతిపురం విశాఖపట్నం తీసుకొని వెళ్లి వేలాది డబ్బులతో రిపేర్ చేసుకోవడానికి వెళ్లే పరిస్థితి ఉందని ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే కనీసం రోడ్లు భవనాల శాఖ అధికారులు గోతులు కప్పకపోవడం చాలా ఆ న్యాయమని ఈ సమస్య పైన పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కు కూడా గతంలో గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏ మాత్రము రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టించుకోలేని పరిస్థితి ఉందని మరి రోడ్లు భవనాలు శాఖ అధికారులు పట్టించుకోకపోతే అటు వాహనదారులకు ఇటు ప్రయాణికులకు భరోసా ఎలా అని కావున వెంటనే మే 20వ తేదీ లోపు ఈ అంతరాష్ట్ర దారి మార్గంలో మరమత్తు పనులు చేపట్టకపోతే తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు, వెంటనే అటు అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివిధ రకాలుగా ఉన్న గోతులను కప్పే విధంగా పనులు వెంటనే చేపట్టాలని కోరుచు న్నామన్నారు .
