పల్నాడు జిల్లా పిడిలుగురాళ్ళ మండలం జానపడు గ్రామంలో సూర్య డెకో ప్రొడక్ట్స్ కంపెనీ వారు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆవులు, గేదెలు, పంటలపై సూర్య డెకో ప్రొడక్ట్స్ కంపెనీ ఎఫెక్ట్ పడుతోంది. కెమికల్ నీరు, డ్రైన్ వాటర్, వ్యర్ధాలు వెంకటేశ్వర్లు అనే రైతు పొలంలోకి వదులుతుండటంతో ఆ నీరు గ్రౌండ్‌వాటర్ పాయిజన్‌గా మారుతోంది. మొక్కలు ఎండిపోతున్నయి. ఈ నీరు పారిన చోట భూమి పైపొర తెల్లగా మారుతోంది. నీటిని తాగిన ఆవులు, బర్రెలు అనారోగ్యానికి గురవుతున్నాయని ఎన్ని సార్లు కంపెనీ మేనేజర్ ఉడతా ప్రసాద్ చెప్పిన పట్టించుకోకుండా .. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో .. అంటూ దుర్జన్యానికి దిగుతున్నదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అసలు సాగు భూములు పక్కన విషపూరితమైన నీటిని వ్యర్ధాలను వదిలే ఇండస్ట్రీ కి ఎలా అనుమతులు లభించినట్టు. పొల్యూషన్ వలన చుట్టుపక్కల పంటలు నాశనమై రైతు నష్టపోయే పరిస్థితి ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.