షణ్ముగం సాప్పని దర్శకత్వంలో హీరో ఆది సాయికుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘షణ్ముఖ’. డివోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్ పై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన షణ్ముఖ ఫస్ట్ లుక్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
షణ్ముఖ రిలీజ్
ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ అవికా గోర్ కథానాయికగా నటించింది.