- ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లంగి మహేష్ బాబు
అల్లూరి జిల్లా,పాడేరు, ది రిపోర్టర్ : ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాడేరు నగరం తో పాటు జిల్లా వ్యాప్తంగా ఏబీవీపీ పాఠశాల ల బంద్ విజయ వంతంగా జరిగిందనీ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లంగి మహేష్ బాబు తెలిపారు,రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో నెలకొన్న పలు సమస్యల పై ఈ బంద్ ను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింద న్నారు,రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 30 వేల ఉపాధ్యాయ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భర్తీ చెయ్యాలని డిమాండ్ చేశారు, ప్రయివేట్, మరియు కార్పొరేట్ పాఠశాల ల్లో జరుగుతున్న అక్రమ పీజుల దోపిడీనీ అరికట్టెందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట మైన చర్యలు చేపట్టాలని అయన కోరారు, పాఠశాలల్లో నెల కొన్న సమస్యల పరిస్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులతల్లి తండ్రుల తో పాటు విద్యార్థి సంఘాల నాయకులతో కూడిన ఒక జిల్లా కమిటీ నీ ఏర్పాటు చెయ్యాలన్నారు,అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థుల ఆరోగ్య రక్షణ నిమిత్తం హెల్త్ వాలింటర్ లను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలల్లో నియమించాలని డిమాండ్ చేశారు,అల్లూరి జిల్లా వ్యాప్తంగా కొన్ని పాఠశాలలు స్వతహాగా బంద్ ను పాటించగా, కొన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు తెరిచి ఉంచగా ఏబీవీపీ నాయకులు వెళ్ళి ఆయా పాఠశాలలను మూయించారాని పేర్కొన్నారు, రాష్ట్ర వ్యాప్త పాఠశాల ల బంద్ కు సహకరించిన ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లి తండ్రులకు అయన ధన్యవాదములు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వినర్ గేమ్మిలి కళ్యాణ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూజారి ఉపేంద్ర. సిదరి వంశీ జిల్లా వనససి విద్యార్థుల విభాగం కన్వినర్ సీసా. సత్తిబాబు ఏబీవీపీ నగర కార్యదర్శి గిర్లియా నాగరాజు,చింతపల్లి భాగ్ కన్వినర్ పాంగి, మోహన్. అరకు భాగ్ కన్వినర్. కొర్ర రాంబాబు. జిల్లా కార్యవర్గ సభ్యులు కిముడు. మల్లెష్. బాబ్జి మహేష్ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.