ప్రకాశం జిల్లా ఒంగోలు లో వాణిజ్య పన్నుల శాఖ అధికారి కేఎస్ శ్రీనివాస ప్రసాద్ లక్ష యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే .. సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఇచ్చి దానిపై జరిమానా విధించినందున, ఆ జరిమానా లేకుండా చేయుటకు లక్ష యాభై వేలు రూపాయలు లంచం డిమాండ్ చేసాడు అధికారి. బాధితుడు అనిశాను సంప్రదించగా అధికారులు రంగంలోకి దిగి సదరు అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండుగా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ పి రామచంద్ర రావు, ఇన్స్పెక్టర్ శేషు, ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్, షేక్.మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.