నల్గొండ జిల్లా : దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్.ఐ శ్రీనివాస్ రెడ్డి కేశ్య తండా గ్రామానికి చెందిన బానవత్ లచ్చు అనే రైతు వద్ద నుండి 30 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. దేవరకొండ లోని మీనాక్షి సెంటర్ వద్ద తన కార్ లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు.